Sunday, January 19, 2025

డయాఫ్రమ్‌వాల్‌పై ఈనాడు వార్తలేవీ?: అంబటి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పోలవరంపై తప్పుడు కథనాలు రాస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గురువారం అంబటి ఈనాడు రాసే వార్తలపై అంబటి స్పందించారు. గైడ్‌బండ్‌పై ఈనాడు తప్పుడు ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుంగిపోతున్నాడని, ఈనాడు బాధపడుతోందని, డయాఫ్రమ్‌వాల్‌పై ఈనాడు ఒక్క వార్త అయినా రాసిందా? అని ప్రశ్నించారు. వైసిపి ప్రభుత్వంపై బురద జల్లడమే ఈనాడు పేపర్ పనిగా పెట్టుకుందని మంత్రి అంబటి చురకలంటించారు.

Also Read: మాణిక్ రావ్ ఠాక్రేతో ఎర్రబెల్లి స్వర్ణ భేటీ

టిడిపి బస్సు యాత్రకు స్పందన లేకపోవడంతో తుస్సు యాత్రగా మారిందని మంత్రి అంబటి దుయ్యబట్టారు. టిడిపి కార్యకర్తలు కూడా బస్సు యాత్రకు రావడం లేదని ఎద్దేవా చేశారు. అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు కన్నా లక్ష్మీనారాయణ ఎక్కడ ఉన్నారని అడిగారు. తనతో సెల్ఫీ ఛాలెంజ్ చేసే నైతిక అర్హత కన్నాకు లేదని విమర్శించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలకు అనర్హుడి అని మండిపడ్డారు. పవన్ రాజకీయాల్లో చంద్రబాబుకు డబ్బింగ్ చెబుతున్నారని చురకలంటించారు. స్థిరత్వం లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, సినిమాల్లో కథానాయకుడు, రాజకీయాల్లో కంత్రీ నాయకుడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎన్నికలప్పుడే వీళ్లకు ఎపి గుర్తుకు వస్తుందని, ఎన్నికలప్పుడు చలో ఎపి, ఎన్నికలు ముగిసిన తరువాత చలో హైదరాబాద్ అంటారని ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News