Monday, December 23, 2024

ఎల్‌ఓసి అందజేత

- Advertisement -
- Advertisement -

బాల్కొండ : మండల కేంద్రానికి చెందిన బండి పెద్ద మల్లయ్య యాదవ గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈవిషయం స్థానిక నాయకులు ద్వారా మంత్రి దృష్టికి తీసుకురాగా హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్‌లో గుండె ఆపరేషన్ కోసం రూ. 3 లక్షల ఎల్‌వోసి మంజూరు చేయించారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో గురువారం రూ. 3 లక్షల ఎల్‌ఓసి కాపీని బాధిత సోదరుడు బండి నడ్పి మల్లయ్యకు మంత్రి చేతుల మీదుగా అందజేశారు.

నిరుపేదలమైన మాకు గుండె ఆపరేషన్ కోసం మూడు లక్షల ఎల్‌ఓసి మంత్రి మంజూరు చేశారని ప్రశాంత్ రెడ్డి మేలు మర్చిపోలేమని, జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని బాధిత కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో బాల్కొండ సర్పంచ్ భూస సునీత నరహరి, బిఆర్‌ఎస్ పార్టీ బాల్కొండ మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యాసాగర్ మంత్రి వెంట ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News