Sunday, December 22, 2024

ఇంటింటి ప్రచారానికి విశేష స్పందన

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ రూరల్ ః జిల్లా కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో గురువారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కొండ మణెమ్మ నాగేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటికి బిజెపి కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్యస్పందన లభించినట్లు ఆమె వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 9 సంవత్సరాల నరేంద్ర మోడి పాలనలో కేంద్రంలో సంక్షేమ పథకాలు ప్రారంభించి పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి చేపట్టిన పథకాలను వివరించి అండగా నిలవాలని కోరడంతో పెద్ద ఎత్తున యువత రాబోయే ఎన్నికలలో బిజెపిని గెలిపించడమే లక్షంగా పనిచేస్తామని స్పష్టం చేసినట్లు వివరించారు. మహిళలు, ప్రజలు శ్రీపురం చౌరస్తా నుంచి ఆర్డిఓ కార్యాలయం వరకు ప్రధాన రహదారిపై నిర్వహించిన ప్రచారానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారు కూడా ప్రచారంలో పాల్గొన్నారని తెలిపారు.

టీ స్టాల్ వద్ద టీ తాగుతూ, టిఫిన్ చేస్తూ ప్రజలను రాష్ట్ర ప్రభుత్వ పాలనపై స్పందన కోరగా తీవ్ర ఆగ్రహంతో వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగ భృత్తి ఉపాధి అవకాశాలు ప్రభుత్వ ఖాళీల భర్తీ చేయకపోవడంపై యువత ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అవినీతి అక్రమాలను పాల్పడుతున్న అధికర నేతలపై మండిపడుతున్నారని, ప్రజలలో స్పష్టంగా బిజెపి గెలిపిస్తేనే డబుల్ ఇంజన్ సర్కార్‌తో అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రజల స్పందనతో నియోజకవర్గంలో బిజెపి జెండా ఎగరడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి ప్రమోద్, జిల్లా కిసాన్ మోర్చా నాయకులు రాజేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు నాగేష్, బిజెవైఎం నాయకులు సత్యనారాయణ, నాయకులు అంజి, చాపల స్వామి, చెన్న రాయుడు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News