Friday, January 10, 2025

రేపు సంగారెడ్డిలో యువ ఉత్సవ్

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: యువతలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించేందుకు రేపు యువ ఉత్సవ్ కార్యక్రమాన్నీ నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన అధికారి రంజిత్‌రెడ్డి తెలిపారు. కేంద్ర యువజన వ్యవహరాలు, మరియు క్రీడ మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం సంయుక్తంగా సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం ఉదయం 9గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు జిల్లా స్థాయి యువ ఉత్సవ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. స్వాతంత్య్ర భారత అమృత కాలం 100సంవత్సరాల సందర్బంగా భారత దేశం 2047 అనే థీమ్‌తో సృజనాత్మకత రచన కవిత్వం చిత్రలేఖనం, మొబైల్ ఫోటోగ్రఫీ, ఉపన్యాసము, సాంస్కృతిక మరియు జానపద కళలు అంశాలపై యువ ఉత్సవ్ కాంపిటేషన్స్ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానం ధ్రువపత్రాలు అందజేస్తారని తెలిపారు. యువ ఉత్సవంలో ప్రతిభావంతులకు రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయికి వెళ్లే అవకాశం ఉందన్నారు. ఈ పోటీల్లో 15 నుంచి 29సంవత్సరాల వయసుగల యువకులు ఔత్సాహికులు తమ వివరాలు నమోదు చేసుకొని పోటీల్లో పాల్గొనాలని ఆయన గురువారం ఒక ప్రకటనలో కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News