ఖానాపూర్ : ఖానాపూర్ పురపాలక సంఘం చైర్మన్, వైస్ చైర్మన్‌ల పై ఈ నెల 16న 9 మంది కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పై హై కోర్టు స్టే విధించినట్లు పురపాలక సంఘం చైర్మన్ అంకం రాజేంధర్ తెలిపారు. బుధవారం పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్ట్రంలో 34 పురపాలక సంఘాలలో అక్కడి కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టగా వాటికి ఏ విధంగా హై కోర్టు స్టే విధించిందో ఖానాపూర్ పురపాలక సంఘానికి కూడా అదే విధంగా స్టే ఇచ్చిందన్నారు. పురపాలక సంఘంలో అవినీతి జరిగిందని కొంత మంది కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారని వారు పూర్థి ఆధారాలతో లిఖిత పూర్వకంగా నిరూనిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుం టామన్నారు. పురపాలక సంఘం ఏర్పాడి మూడున్నర సంవత్సరాలు గడిచినప్పటికి రెండు సంవత్సరాలు కరోనాతో గడిచిపోయిందని సంవత్సరంగా పురపాలక సంఘం అభివృద్ధ్ది చేస్తుంటే అభివృద్ధిని అడ్డుకొని అవినీతి అంటున్నారని పురపాలక సంఘంలో నయా పైసా మంజూరు కావాలన్నా కలెక్టర్ అనుమతి ఉండాలని ఇష్టం వచ్చిన విధంగా డబ్బులు డ్రా చేసుకునేందుకు అనుమతి లేదన్నారు. అనవసరంగా అవినీతి ఆరోపణలు చేస్తే కోర్టును ఆశ్రయించి పరువు నష్టం దావా వేస్తామని మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు బండారి కిషోర్, నాయకులు కారింగుల సుమన్, పానుగంటి రాజేంధర్, తదితరులు ఉన్నారు.
అవిశ్వాస తీర్మానం పై హై కోర్టు స్టే
- Advertisement -
- Advertisement -
- Advertisement -