Monday, December 23, 2024

మధ్యప్రదేశ్ సిఎంపై పోస్టర్లు..

- Advertisement -
- Advertisement -

భోపాల్ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మధ్యప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య పోస్టల్ వార్ ప్రారంభమైంది. అయితే బీజేపీని ఉద్దేశించి కాంగ్రెస్ వెలువరించిన పోస్టర్లపై డిజిటల్ పేమెంట్స్ సంస్థ ఫోన్ పే అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పోస్టర్లపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఫోటోలు, క్యూఆర్ కోడ్స్ ఉండడమే కాక, ఫోన్‌పే బ్రాండ్ నేమ్, లోగోకూడా కనిపిస్తున్నాయి. ఈ చిత్రాలను మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసి, రాష్ట్ర ప్రభుత్వంలో ఒక పని జరగాలంటే 50 శాతం కమీషన్ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని విమర్శలు చేసింది. దీనికి ఫోన్ పే స్పందించి తమ బ్రాండ్ లోగో దుర్వినియోగం చేస్తున్నారని మండిపడింది. “మాకు ఏ రాజకీయ పార్టీ లేక ప్రచారంతో సంబంధం లేదు.

ఫోన్‌పే లోగో… మా సంస్థకు చెందిన ట్రేడ్‌మార్కు. దీన్ని అనధికారికంగా వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకునే వీలుంది. మా బ్రాండ్ లోగో, రంగుతో ఉన్న పోస్టర్లు, బ్యానర్లను తొలగించాలని మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌కు వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం ” అని ఫోన్‌పే ట్విటర్ వేదికగా స్పందించింది. గతంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బసవరాజ్ బొమ్మై సర్కారుపై కాంగ్రెస్ ఈ విధంగానే “ 40 పర్సెంట్ సర్కార్ అని, పేసీఎం అని పోస్టర్లు అంటించి ప్రచారం చేసింది. ఇదిలా ఉండగా “ వాంటెడ్ కమీషన్ నాథ్’ ’ అంటూ మధ్యప్రదేశ్‌లో ఈ పోస్టర్ వార్‌ను బీజేపీయే ప్రారంభించిందని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే బీజేపీ వీటిని ఖండించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News