Monday, December 23, 2024

ఇందల్వాయిలో రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

డిచ్‌పల్లి : మండల కేంద్రంలో 44వ జాతీయ రహదారి హైవే యూనియన్ బ్యాంక్ వద్ద ఆగిఉన్న డిసిఎంను ద్విచక్ర వాహనం అతివేగంతో వచ్చి ఢీకొన్న ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకుల్లో ఒక్కరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందల్వాయి మండలం ఎత్తు తండా గ్రామానికి చెందిన బాధవత్ నితిన్, బాదవత్ ప్రవీణ్ దేగవాథ్ రామ్ యువకులు స్వగ్రామం నుండి డిచ్‌పల్లి వెళ్తుండగా ఇందల్వాయి బ్రిడ్జిపై నుండి వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈఘటనలో దేగావాథ్ రామ్ (20) ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మిగతా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News