Monday, December 23, 2024

చెట్టు మీద పడి వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

ఆళ్లపల్లి : చెట్టు కొమ్మ విరిగి మీదపడి వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన ఆళ్లపల్లిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండల సమీపంలోని ఒక రైతుకు చెందిన చేనులో ఈ మధ్య గాలి దుమరానికి కొన్ని వృక్షాలు నెలకొరిగి చేనులో అడ్డంగా ఉండడంతో ఆళ్లపల్లికి చెందిన వడ్రంగి వృత్తిదారుడు కాలం వెంకన్నను సదరు రైతు చెట్లను తొలగించేందుకు తీసుకుపోగా చెట్లను తొలగించే క్రమంలో ప్రమాదవశాత్తు చెట్టు మండ వెంకన్న తలకు బలంగా తాకడంతో వెంకన్న మృతి చెందాడు. వెంకన్న అకస్మాత్తుగా మృత్యువాత పడడంతో భార్య లావణ్య పిల్లలు జెస్సికా, విక్కీ, లిక్కిల రోదనలతో మండలంలో విషాద చాయలు అలుముకున్నాయి. మృతుడు వెంకన్న బిఆర్ పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా కీలక బాధ్యతలో ఉన్నాడు. మృతిచెందిన విషయం తెలుసుకున్న స్థానిక ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి ,వైస్ ఎంపీపీ రేసు ఎల్లయ్య, బిఆర్‌ఎస్ అధ్యక్ష కార్యదర్శులు పాయం నరసింహారావు, బాబా, సీనియర్ నాయకులు ఎండి. అతహర్, సయ్యద్ హఫీస్, వార్డు సభ్యులు ఖయ్యూం, బిఆర్‌ఎస్ మండల ప్రచార కార్యదర్శి నరెడ్ల ప్రవీణ్, విచారం వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

  • ఆర్టిసి బస్సు ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు

బూర్గంపాడు : ఆర్టిసి అద్దె బస్సు ఢీకొని వ్యక్తికి గాయాలైన సంఘటన గురువారం మండల పరిధిలోని అంజనాపురం వద్ద చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అంజనాపురం గ్రామానికి చెందిన బోడ శ్రీను తన ద్విచక్ర వాహనంపై మోరంపల్లి బంజర వెళ్ళి తిరిగి ఇంటికి వెళుతున్న క్రమంలో ఖమ్మం వైపు వెళుతున్న ఆర్టిసి అద్దె బస్సు అంజనాపురం గ్రామం వద్ద వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోతూ వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో బోడ శ్రీను తల, చేతికి తీవ్ర గాయాలు కాగా 108 వాహనంలో కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News