Monday, December 23, 2024

గురుద్వారాను దర్శించుకున్న మంత్రి గంగుల

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాల వారిని సమానంగా చూస్తుందని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. గురువారం గురుద్వారా కమ్యూనిటీ భవనంలో 25 లక్షలతో నిర్మించే లంగర్ హౌస్ (వంట గది) నిర్మాణానికి నగర మేయర్ సునీల్‌రావుతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ భూమి పూజ చేశారు. పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

మొదట గురుద్వారాలో మంత్రి గంగుల ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిక్ ప్రబంద్ కమిటీ సభ్యులు మంత్రి గంగులను సన్మానించి ఖడ్గాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మధు, కో ఆప్షన్ సభ్యుడు నరేందర్, పలువురు నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News