హైదరాబాద్ ః తెలంగాణ బిజెపి నాయకత్వానికి ఇలాంటి ట్రీట్‌మెంట్ అవసరమంటూ ఆపార్టీనేత మాజీ ఎంపీ జితేందర్ చేసిన ట్విట్ కలకలం రేపుతోంది. దున్నపోతుల్ని తన్నుకుంటూ ఓవ్యక్తి ట్రాలీలో ఎక్కిన వీడియోను పోస్ట్ చేసిన ఆయన ఇది తెలంగాణకు అవసరమంటూ క్యాప్షన్ ఉంచారు. ఆయన కాసేటికి దానిని తొలగించి, మళ్లీ పోస్టు చేసి ఆట్విట్‌కు అమిత్ షా, బిఎల్ సంతోష్‌కుమార్, సునీల్ బన్సాల్ లాంటి అగ్రనేతలను ట్యాగ్ చేశారు.
అయితే ఆయన ట్విటర్ వాల్‌పై ఆపోస్టు కనిపించకపోవడంతో ఆయన దానిని తొలిగించినట్లు అర్దమైంది. ఆవెంటనే మళ్లీ ఆవీడియోను ఆయన పోస్టు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ బిజెపి శ్రేణులు ఆయన ఎవరిని ఉద్దేశించి పోస్టు చేశారని ఆరా తీస్తున్నారు. ఆయన తీరుపై కొందరు నేతలు పార్టీ మారేందుకు కొత్త ప్రయోగాలు చేస్తున్నారని, పార్టీ హైకమాండ్‌పై అసంతృప్తి చూపిస్తున్నారని భావిస్తున్నారు.