Thursday, November 14, 2024

జన గర్జనకు తరలిరండి

- Advertisement -
- Advertisement -

తొర్రూరు : జూలై 2న ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ జన గర్జన భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ప్రతీ ఒక్కరూ తరలి రావాలని ఎన్‌ఆర్‌ఐ, చెర్లపాలెం గ్రామానికి చెందిన హనుమాండ్ల ఝాన్సీరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని నాంచారిమడూరు గ్రామంలోని రెడ్డి గార్డెన్‌లో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా ఝాన్సీరెడ్డి పాల్గొని మాట్లాడుతూ జూలై 2న ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ సమక్షంలో చేరబోతున్నట్లు తెలిపారు. ఈ సభకు పాలకుర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు వేలాది మందిగా తరలించాలని నాయకులకు పిలుపునిచ్చారు. ఖమ్మంలో నిర్వహించే సభ ద్వారా రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని, పాలకుర్తిలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమన్నారు. నియోజకవర్గంలోని ప్రతీ మండలంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రతీ గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.

ఈ సమావేశంలో తొర్రూరు కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు హామ్యానాయక్, పాలకుర్తి బ్లాక్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మాజీ బ్లాక్ అధ్యక్షుడు కేతిరెడ్డి నిరంజన్‌రెడ్డి, తొర్రూరు మండల అధ్యక్షులు జక్కుల రాంరెడ్డి, చెవిటి సదాకర్, రాయపర్తి మండల అధ్యక్షులు మాచర్ల ప్రభాకర్, పెద్దవంగర మండల అధ్యక్షులు ముద్దసాని సురేశ్, పాలకుర్తి మండల అధ్యక్షులు గిరగాని కుమార్, ధరావత్ సురేశ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News