Sunday, January 19, 2025

నేడు రైతుకు పట్టాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీని కార్యక్రమాన్ని అసిఫాబాద్ జిల్లా కేంద్రం నుండి శుక్రవారం (జూన్ 30)న ముఖ్యమంత్రి కెసిఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కుమ్రం భీమ్ అసిఫాబాద్ జిల్లా కేంద్రానికి ముఖ్యమంత్రి చేరుకుని, అక్కడ గోండు వీరుడు, సాయుధ తెలంగాణ పోరాట యోధుడు కుమ్ర భీమ్ విగ్రహాన్ని ఆవిష్కరించి, కొమ్రం భీమ్‌కు ఘన నివాళులర్పిస్తారు.ఆ తర్వాత టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ

తర్వాత జిల్లా కేంద్రంలో కోట్నక్ భీమ్రావు విగ్రహావిష్కరణ చేసి, పుష్పాంజలి ఘటిస్తారు. అనంతరం జిల్లా ఎస్‌పి కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత..ప్రారంభానికి సిద్ధంగా వున్న సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయాల సముదాయానికి చేరుకొని సిఎం కెసిఆర్ ప్రారంభిస్తారు. అనంతరం లబ్ధిదారులకు పోడుపట్టాలను అందజేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని సిఎం ప్రసంగిస్తారు. దాంతో సిఎం కెసిఆర్ జిల్లా పర్యటన ముగుస్తుంది. మంత్రులు, ఎంఎల్‌ఎలు వారి వారి జిల్లాలు, నియోజకవర్గాల్లో అదే రోజు పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్నారు.
కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పాల్గొననున్న మంత్రి హరీశ్‌రావు
రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పోడు భూముల పట్టా పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉదయం 11.30 గంటలకు కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పోడు భూముల పట్టా పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మం జిల్లాలో నూతనంగా మంజూరై ఈ సంవత్సరం ప్రారంభించబోతున్న ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలను సందర్శించనున్నారు. అంతరం 3.30 గంటలకు ఖమ్మం జిల్లాకు సంబంధించిన పోడు భూముల పట్టా పంపిణీ కార్యక్రమంలో ఖమ్మం పట్టణంలో పాల్గొననున్న మంత్రి హరీశ్ రావు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News