- Advertisement -
హైదరాబాద్ : కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోనియా గాంధీ నగర్‌లో కొబ్బరి ముక్క గొంతులో ఇరుక్కుని మూడేళ్ల బాలుడు మృతి చెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సోనియా గాంధీ నగర్‌లో నివాసముంటున్న ఆటో డ్రైవర్ శ్రీనివాస్, శ్రీదేవి దంపతులకు జశ్వంత్ అనే మూడేళ్ళ కుమారుడు ఉన్నాడు. కాగా, గురువారం కొబ్బరి తింటున్న క్రమంలో జశ్వంత్‌కు గొంతులో కొబ్బరి ముక్క ఇరుక్కుంది. దీంతో ఊపిరాడక జశ్వంత్ మృతి చెందాడు. అల్లరి ముద్దుగా చూసుకొంటున్న జశ్వంత్ మృతితో బాలుడి తల్లిదండ్రులుకన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో సోనియా గాంధీ నగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
- Advertisement -