- Advertisement -
- నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చం ద్రారెడ్డి
కీసర: పట్టణ ప్రజల అవసరాల మేరకు దశల వారీగా అభి వృద్ధి పనులు చేపడుతున్నామని నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చం ద్రారెడ్డి అన్నారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు ప్రభాకర్ ఎన్‌క్లేవ్‌లో భూగర్బ మురుగు కాలువ నిర్మాణం, 17వ వార్డు సత్యనారాయణ కాలనీలో పార్కు స్థలం చుట్టు ప్రహారీ నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్మన్ చంద్రారెడ్డి మాట్లాడుతూ అన్ని వార్డులలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మున్సి పాలిటీలో పారదర్శకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ బండారు మల్లేష్ మాదవ్, కౌన్సిలర్ అన్నంరాజు లావణ్యశ్రీనివాస్, నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
- Advertisement -