Saturday, November 16, 2024

101 ఏండ్ల సర్దార్జీకి బ్రిటన్ పురస్కారం

- Advertisement -
- Advertisement -

లండన్ : రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్న సిక్కు సైనికుడు 101 సంవత్సరాల మేజర్ రాజీందర్ సింగ్ ధాత్‌ను బ్రిటన్ ప్రధాని రిషిసునాక్ తమ అధికారిక నివాసంలో సన్మానించారు. ఈ సర్దార్జీకి బ్రిటన్‌లోని విశిష్టమైన పాయింట్స్ ఆఫ్‌లైట్ హానర్ పురస్కారం అందించారు. రెండో ప్రపంచ యుద్ధం దశలో బ్రిటన్ మిత్రపక్ష దేశాల సైన్యాలలో పాల్గొన్న సైనికుల్లో రాజేందర్ సింగ్ చివరి వారు. భారత్‌కు చెందిన ఈ సింగ్ 1963 నుంచి లండన్‌లోని హౌన్లోలో ఉంటున్నారు.

1921లో అవిభక్త భారతదేశంలో ఆయన జన్మించారు. అవిభక్త భారతీయ మాజీ సైనికోద్యోగుల సంఘంలో ఈ వయస్సులో కూడా ఆయన పాలుపంచుకుంటూ బ్రిటిష్ ఇండియన్ వార్ వెటర్న్‌ను ఏకతాటిపైకితీసుకువస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఆయన బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో చేరారు. హవల్దార్ మేజర్ స్థాయి వరకూ ఎదిగారు. తన 102 వ జన్మదినం సమీపిస్తున్న తరుణంలోనే తన సేవలకు ఈ విధంగా సరైన ప్రతిఫలం లభించినందుకు సంతోషంగా ఉందని ఈ మేజర్ సాబ్ హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News