Saturday, December 21, 2024

మిస్ టీన్ తెలంగాణలో రాణించిన ముమ్మడి హన్సిక

- Advertisement -
- Advertisement -

చాంద్రాయణగుట్ట: గ్లోబల్ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో ఇటీవల ఢిల్లీలో జరిగిన మిస్ టీన్ తెలంగాణ 2023 అందాల పోటీలో హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్టకు చెం దిన ముమ్మడి హన్సిక తొలి ప్రయత్నంలోనే ఆకట్టుకుంది. తెలంగాణ సాంప్రదాయ దుస్తులలో ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేస్తూ అం దరిని అబ్బురపరిచింది. పిట్టకొంచెం కూత ఘనం అన్నట్లు చిన్నతనం నుండే ఫ్యాషన్ డిజైన్, కబడ్డీ, కరాటే, కూచిపూడి, టిక్ టాక్ వంటి అంశాలలో రాణిస్తుంది. అనేక పోటీలలో పాల్గొని సర్టిఫికెట్లు, జ్ఞాపికల, పథకాలను సొంతం చేసుకుంది.

ఒక వైపు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతూనే మరోవైపు పలు అంశాలలో ప్రతిభ చూపుతుంది. తండ్రి ముమ్మడి అంకాలప్పచారి, తల్లి సు మాంజలిల మూడవ సంతానమైన ముమ్మడి హన్సికది స్వగ్రామం వనపర్తి జిల్లా పెబ్బెరు మండలం. తన తల్లిదండ్రుల, అక్కలు ఆకాంక్ష, దివ్యల సహకారం ఎం తో ఉందన్నారు. బాల్యం నుండే పలు అంశాలలో మక్కువ చూపుతు న్న హన్సికకు సరైన ప్రోత్సాహం లభిస్తే భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News