Tuesday, January 21, 2025

దేశ సమగ్రాభివృద్ది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం : ఉత్తమ్ కుమార్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్ : కష్టపడి పని చేసే వారికి పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని మాజీ టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆదం సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. ఆత్మీయ సమ్మేళనంలో సికింద్రాబాద్ కు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

బిజెపి పాలనలో దేశం అన్ని రంగాలలో తిరోగమనంలో పయనిస్తున్నదని దేశ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా సుపరిపాలన అందించడం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమన్నారు. బిఆర్‌ఎస్ పాలనలో రాష్టంలోని అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నా. పార్టీ పటిష్టత కోసం ప్రతి ఒక్కరు అంకితభావంతో పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదం సంతోష్ కుమార్ 35 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్నారని తప్పనిసరిగా ఆయన సేవలను గుర్తించి సముచిత స్థానం కల్పిస్తామన్నారు.

రానున్న ఎన్నికల్లో గెలుపే లక్షంగా ప్రతి కార్యకర్త ముందుకు సాగాలని సీనియర్ నేత వి. హనుమంతు రావు అన్నారు. ఆదం సంతోష్ కుమార్ మాట్లాడుతూ సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామన్నారు. కార్యక్రమంలో మేకల సారంగపాణి, వెంకటేష్ గౌడ్, కన్నాభిరామ్, మహేందర్ యాదవ్, శిల్పాచారి, దక్షిణ మధ్య రైల్వే సంఘ్ నుండి బరణి, అరుణ్ నరేష్, బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News