Monday, December 23, 2024

స్నేహితుడిని చంపి… రోడ్డు ప్రమాదంలో తానే మృతి చెందినట్టుగా చిత్రీకరించి…

- Advertisement -
- Advertisement -

ఛండీగఢ్: బీమా డబ్బుల కోసం స్నేహితుడిని చంపి తానే రోడ్డు ప్రమాదంలో మరణించినట్టుగా సృష్టించి దంపతులు డ్రామా ఆడి దొరికిపోయిన సంఘటన పంజాబ్ రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సైన్‌పూర్ ప్రాంతంలో గురుప్రీత్ సింగ్ అనే వ్యాపారవేత్త ఉన్నాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో తన పేరు నాలుగు కోట్ల రూపాయలు బీమా పొందాడు. గురుప్రీత్‌కు సుఖ్‌జీత్ అనే స్నేహితుడు ఉన్నాడు. గత కొన్ని రోజులుగా సుఖ్‌జీత్ మద్యం తాగించి స్నేహంగా ఉన్నాడు. ఈ జూన్ 19న సుఖ్‌జీత్ పూటుగా గురుప్రీత్ మద్యం తాగించాడు.

Also Read: పాటే ప్రాణం..ఉద్యమమే ఊపిరి

సుఖ్‌జీత్ చంపేసి అనంతరం రోడ్డుపై అతడి ముఖాన్ని లారీతో తొక్కించాడు. రోడ్డు ప్రమాదంలో చనిపోయింది తన భర్తే అని తెలపడంతో ఆమెకు మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించి అప్పగించారు. తన భర్త కనిపించడంలేదని సుఖ్‌జీత్ భార్య స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గురుప్రీత్‌తో తన భర్త మద్యం సేవించేవాడని పోలీసులకు తెలిపింది. అనుమానం గురుప్రీత్ భార్యను అదుపులోకి తీసుకొని విచారించగా అతడు బతికే ఉన్నట్లు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News