Thursday, April 17, 2025

అమ్మోనియా గ్యాస్ లీకై 15 మందికి అస్వస్థత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో అమ్మోనియా గ్యాస్ లీకై 15 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతేనగర్ లో చోటుచేసుకుంది. ఓ దొంగ చెత్తకుప్పలోని సిలిండర్లు ఇత్తడి వాల్వ్ లు తీసుకునేందుకు యత్నించాడు. దీంతో సిలిండర్ నుంచి పెద్దఎత్తున అమ్మోనియా గ్యాస్ లీకై 12 మీటర్ల ఎత్తులో ఆ ప్రాంతంలో విస్తరించింది. స్థానికంగా ఉన్న కంపెనీలోని 10 మంది బిహార్ కార్మికులకులు గ్యాస్ పీల్చుకోవడంతో ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురవ్వగా సమీపంలో ఉన్న బస్తీలో ఐదుగురు వాంతులు, కళ్ల మంటలతో ఇబ్బంది పడ్డారు. బాధితులను బాలానగర్ బిబిఆర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News