Monday, December 23, 2024

యుపిలో రోడ్డు ప్రమాదం: ఏడుగురి మృతి

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏఒడుగురు మరణించగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వేగంగా వెళుతున్న ఒక కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.

బంద జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తమ కుటుంబ సభ్యులలో ఒకరిని కారులో ఆసుపత్రికి తీసుకువెళుతుండగా డ్రైవర్ అజాగ్రత్త వల్ల కారు ట్రక్కును ఢీకొంది. ఈ సంఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు ఆసుపత్రిలో మరనించారు. మృతులు తిలౌసా గ్రామానికి చెందిన వారిగా గుర్తించినట్లు డిఎస్‌పి రాకేష్ కుమార్ సింగ్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News