Friday, November 22, 2024

పోలీసులు రెగ్యులర్‌గా హెల్త్ చెకప్ చేయించుకోవాలి

- Advertisement -
- Advertisement -
  • మెదక్ ఎస్పి రోహిణి ప్రియదర్శిని

మెదక్ టౌన్: పోలీసులు రెగ్యులర్‌గా హెల్త్ చెక్ ఆప్స్ చేయించుకోవాలని మెదక్ ఎస్పి రోహిణి ప్రియదర్శిని తెలిపారు. శుక్రవారం బాలుర జూనియర్ కళాశాల మైదానంలో జిల్లాలోని సివిల్, ఆర్మూడ్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్, హోంగార్డు సిబ్బందికి ఆర్స్ డ్రిల్, పుట్ డ్రిల్, ఏఆర్ డిఎస్పి శ్రీనివాస్, ఆర్‌ఐ అచ్యుతరావు, ఆర్‌ఐ నాగేశ్వరరావు గార్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి ఫిట్నెస్‌తోపాటు, సమయం దొరికినప్పుడు సిబ్బంది అధికారులు వ్యాయమం చేయడం అనేది చాలా ముఖ్యమని, మంచి శక్తి సామర్థాలతో ఎలాంటి ఆనారోగ్యానికి గురికాకుండా విధులు నిర్వహించడానికి మంచి అవకాశం ఉంటుందన్నారు. ఫిట్నెస్‌ను అనునిత్యం కాపాడుకోవాలన్నారు. పోలీసులు మంచి జీవన విదానాన్ని అవలంభించాలన్నారు. వ్యాయమాన్ని నిత్య జీవితంలోనూ బాగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ డిఎస్పి సైదులు, జిల్లా సిఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, జిల్లా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News