పెద్దేముల్: ఉపాధ్యాయులు విద్యావ్యవస్థలో వస్తున్న అధునిక మార్పు లకు అనుగుణంగా విద్యాబోధన చేయాలని పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్ అన్నారు. శుక్రవారం డీఈఓ కార్యాలయంలో అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ రవి చేతుల మీదగా మండలానికి చెందిన పలువురు హెచ్‌ఎంలు నూతన ట్యాబ్‌లు అందుకున్నారు.
ఈ సందర్భంగా రాజశేఖర్, నవీన్ కుమా ర్‌లు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలకు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని.. ఇందులో భాగంగా విద్యాశాఖలో అనేక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. విద్యార్థుల సమగ్ర సమాచారాన్ని నిక్షిప్తం చేసేందుకు పాఠశాలకు ట్యాబ్‌లను అందజేస్తుందని చెప్పారు. ఈ మేరకు మండలంలో గల 46 పాఠశాలలకు ప్రభుత్వం నూతన ట్యాబ్‌లను అందజేసిందన్నారు.
ఈ ట్యాబ్‌లలో విద్యాశాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలు, పురోగతి, పాఠశాలలో విద్యార్థికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని నిక్షిప్తం చేయాలని చెప్పారు. ముఖ్యంగా స బ్జెక్టుల వారిగా విద్యార్థి బలాలు, బలహీనతలు, విద్యార్థి హజరు, పు స్తకాల పంపిణీ, మధ్యాహ్నా భోజన వివరాలు, వివిధ పరీక్షలలో వచ్చే మార్కులు తదితర వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్‌లలో నమోదు చే యాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంలు నర్సింహులు, వారిజ, రమణ రావు, రవీంద్రనాథ్, శ్రీకాంత్, గాయత్రీశ్రీవాణి, భాగ్యలక్షీ, అనురాధ, గిరిజ, అక్బర్, రవి తదితరులు పాల్గొన్నారు.