Monday, December 23, 2024

అభివృద్ధిలో తెలంగాణ నెంబర్ వన్

- Advertisement -
- Advertisement -

కారేపల్లి : అభివృద్ధిలో తెలంగాణ నెంబర్ వన్ అని బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్దబోయిన ఉమాశంకర్ అన్నారు. మండల కేంద్రంలోని బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ ఆదేశానుసారం మండల అధ్యక్షుడు పెద్దబోయిన ఉమాశంకర్ ఆధ్వర్యంలో శుక్రవారం ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉమా శంకర్ మాట్లాడుతూ బిఆర్‌ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కెసిఆర్ తోనే అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయన్నారు.

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి దేశంలో ఎక్కడా లేదన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి రావూరి శ్రీనివాసరావు, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, మండల రైతు బంధు కన్వీనర్ ఈసాల నాగేశ్వరరావు, నాయకులు తోటకూరి పిచ్చయ్య, అజ్మీర వీరన్న, తోటకూరి రాంబాబు, అడపా పుల్లారావు, బాణోత్ పద్మావతీ, సర్పంచ్ లు భూక్యా రంగారావు ,కురసం సత్యనారాయణ, కుమార్, ఆదినారాయణ, ఎట్టి రజిని రామారావు, ఎంపీటీసీలు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News