Monday, January 20, 2025

ఔటర్‌పై మరో ఇంటర్ ఛేంజ్

- Advertisement -
- Advertisement -
రూ.29.50 కోట్లతో పూర్తి
నేడు ప్రారంభించనున్న పురపాలక శాఖ మంత్రి కెటిఆర్

హైదరాబాద్: ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్)పైన మరో ఇంటర్‌ఛేంజ్ అందుబాటులోకి రానుంది. నార్సింగి వద్ద రూ.29.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఇంటర్‌ఛేంజ్ ను శనివారం ఉదయం పది గంటలకు పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ప్రారంభించనున్నారు. ఈ ఇంటర్‌ఛేంజ్ నిర్మాణం వల్ల నార్సింగి, మంచిరేవుల, గండిపేట్ ప్రాంతాల ప్రయాణికులతో పాటు లంగర్‌హౌస్, శంకర్ పల్లి ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు ఓఆఅర్‌ఆర్ మీదుగా వారి గమ్యస్థానానికి చేరుకోవడానికి ఎంతో సులువు అవుతుందని హెచ్‌ఎండిఏ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News