Monday, December 23, 2024

భీమ్ ఆర్మీ చీఫ్‌ కాల్పుల ఘటనపై విచారణ జరిపించాలి

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ : భీమ్ ఆర్మీ జాతీయ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్‌పై యుపిలో కొందరు అగ్రవర్ణాలకు చెందిన నాయకులు కాల్పులు జరపడాన్ని బిఎల్‌ఎఫ్, భీమ్ ఆర్మీ తీవ్రంగా ఖండిస్తుందని బిఎల్‌ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో బిఎల్‌ఎఫ్, భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా బిఎల్‌ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్, భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు సంజీవ్ సచేనేలు మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో ఒక కార్యక్రమంలో భీమ్ ఆర్మీ జాతీయ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ పాల్గొన్న సమయంలో ఆయనపై కొందరు అగ్రవర్ణాలకు చెందిన దుండగులు కాల్పులు జరిపారని, ఈఘటనపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. యుపిలో బిజెపి ప్రభుత్వ అండదండలతోనే భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌పై కాల్పులు జరిపారని అన్నారు.

యుపిలో ముఖ్యమంత్రి యోగి ఆకృత్యాలను ఆపకపోతే బహుజన సమాజం తీవ్రంగా ప్రతిఘటిస్తుందన్నారు. తెలంగాణలో సైతం భీమ్ ఆర్మీ, బిఎల్‌ఎఫ్, వామపక్ష నాయకులు, భీమ్ ఆర్మీ చీఫ్‌పై కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో బహుజన మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బనిలత, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గీతాంజలి, దండు జ్యోతి, కవిత, మధు, ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, భీమ్ ఆర్మీ నాయకులు రాహుల్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News