Saturday, November 23, 2024

నేడు, రేపు అరుణాచలానికి టిఎస్ ఆర్‌టిసి ప్రత్యేక బస్సులు

- Advertisement -
- Advertisement -
తొలి సారి ప్రవేశ పెట్టిన టూర్ ప్యాకేజీకి అనూహ్య స్పందన

హైదరాబాద్ : అరుణాచలేశ్వరుని గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తుల కోసం టిఎస్ ఆర్‌టిసి తొలిసారిగా ప్రవేశపెట్టిన టూర్ ప్యాకేజీకి అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటివరకు 30 ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులను ఆర్‌టిసి ఏర్పాటు చేయగా.. ఆ సర్వీసుల్లోని సీట్లన్నీ భర్తీ అయ్యాయి. భక్తుల రద్దీని బట్టి మరికొన్ని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని టిఎస్ ఆర్‌టిసి భావిస్తోంది. ఈ ప్రత్యేక బస్సులన్నీ జులై 1, 2 తేదిల్లో హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అరుణాచలానికి బయలుదేరుతాయి.

తక్కువ సమయం ఉండటంతో అరుణాచల టూర్ ప్యాకేజీ కోసం www.tsrtconline.in వెబ్ సైట్‌ను సంప్రదించి.. ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని ఆర్‌టిసి సంస్థ భక్తులను కోరుతోంది. జులై 3న గురుపౌర్ణమి సందర్భంగా అరుణాచలానికి టిఎస్‌ఆర్‌టిసి రెండు రోజుల టూర్ ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. మొదట కాణిపాకంలోని విఘ్నేశ్వరుని దర్శన అనంతరం అరుణాచలానికి ఈ బస్సులు చేరుకుంటాయి. తిరుగుప్రయాణంలో గోల్డెన్ టెంపుల్ దర్శనం కూడా ఉంటుంది. ఈ ప్యాకేజీలో భాగంగా మొదట ఒక ప్రత్యేక బస్సునే ఏర్పాటు చేయగా.. అనూహ్యంగా డిమాండ్ పెరగడంతో సర్వీసులను సంస్థ మరిన్ని పెంచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News