Saturday, January 11, 2025

బిఆర్‌ఎస్ నాయకుడు మృతికి ఎమ్మెల్యే సంతాపం

- Advertisement -
- Advertisement -

చిన్నశంకరంపేట: చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి మృతిచెంది న విషయం తెలుసుకున్న మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆయన స్వగ్రామానికి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను శుక్రవారం పరామర్శించారు. నరసింహారెడ్డి పార్థివదేహాంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. నరసింహారెడ్డి మరణం బిఆర్‌ఎస్‌కి తీరనిలోటని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పట్లోరి రాజు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు లకా్ష్మరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్లు అంజిరెడ్డి, కుమ్మరిపల్లి శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ మండల నాయకులు రాంరెడ్డి, బోయిని ప్రభాకర్, గుగులోత్ సుధాకర్, కుంట నరేష్, లాలూనాయక్, నగేష్, సురేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News