Monday, November 18, 2024

దేశ భవిష్యత్తు యువకుల చేతిలో ఉంది

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి : ఈ భారతదేశ భవిష్యత్తు యువకుల చేతిలో ఉందని రేపటి మార్గదర్శకులు వారేనని భూపాలపల్లి ఎమ్మేల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.జిల్లా పోలీస్ ,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యాంటి డ్రగ్ అవగాహన కార్యక్రమంలో అంబేద్కర్ సెంటర్ వద్ద యాంటి డ్రగ్స్ ప్రమాణం చేసిఅక్కడి నుండి సింగరేణి పంక్షన్ హల్ వరకు ర్యాలీగా వెళ్ళారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గండ్ర పాల్గ్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశం ముఖ్య సాంప్రాదాయాలు కల్గిన దేశమని కాని దురదృష్టవశాత్తు ఈ మధ్య కాలంలో యువత నేను తాగుతా ఏమైనా చేస్తా గొప్పగా అని చెప్పుకుంటున్నారు అని అన్నారు.సమాజంలో ఎంతో మంది మత్తుకి బానిసలై వారు చేస్తున్న ఆకృత్యాలు చూస్తున్నామని వారి చేడు ఆలవాళ్ళట్లకు ఆనారోగ్యం పాలవుతున్నారు.

ఈ సృష్టిలో ఎంతో జీవరాశి ఉన్న దేనికి లేని పరివర్తన మానవజన్మకి ఉందని అన్నారు.ఇందులో పోలీస్ శాఖ నియంత్రిస్తున్న , మనం కూడా తోటి వారిని నియంత్రిచాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. మత్తుకి బానిస అయిన వారికి కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి వారిలో మంచి పరివర్తన వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా తల్లిదండ్రులు పిల్లల యొక్క ప్రవర్తనపై అవగాహన కల్గి ఉండాలని.వారు చేస్తున్న పనులలో మంచి చేడులను ఎప్పటికప్పుడు అవగాహన కల్గి ఉండాలని కోరారు.పిల్లల దినచర్య పట్ల తల్లిదండ్రలు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు.

ఉన్నత చదువులు చుదువుతున్న విద్యార్థులు దూరలవాట్లకు అలవాటై చనిపోతున్నారని అన్నారు.చాలా వరకు సరదాగా అలవాటుగా మారి జీవితాన్నే నాశనం చేస్తుందని,బంగారు భవిషత్ ఉన్న యువతకు అవగాహన కల్పించాలని పోలిస్ శాఖతో ప్రజలు కూడా ముందుకు రావాలని సరైన సమయంలో కౌన్సిలింగ్ బంగారు బాటలు వేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పి సురేందర్‌రెడ్డి,ఎఎస్‌పి శ్రీని వాసు లు,డిఎస్‌పి రాములు,జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ బుర్ర రమేష్ మున్సిపల్ ఛైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణి, వైస్ ఛైర్మన్ కోత్త హరిబాబు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News