Monday, December 23, 2024

ప్రభుత్వ పథకాలతో అన్ని వర్గాల అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: సీఎం కేసీఆర్ రజకులకు ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై యువత టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధిని చూసి పట్టణ రజక సంఘం కుల పెద్దమనిషి బొడ్డుపల్లి వెంకటేష్‌తోపాటు సభ్యులు పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి బీఆర్‌ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు. రజకులకు ఉచిత విద్యుత్‌తోపాటు ప్రభుత్వ రుణాలను అందించి ఆర్థిక చేయూతను కల్పిస్తూ ఆదుకుంటున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జడల సురేందర్, సింగిల్ విండో చైర్మన్ పురుషోత్తం, బొడ్డుపల్లి రమేష్, అశోక్, చిట్టి శ్రీను, కుక్క కనకరాజు, వెన్నం రవీందర్, బొంకూరి అనిల్, పల్లె మధు, దావల్ల శ్రీనివాస్, కడమంచి శివ, కుక్క మనోజ్ కుమార్, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News