Sunday, November 24, 2024

యువకుడి హత్యకేసును చేధించిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

దేవరకొండ: పట్టణంలోని మిషన్ కంపౌండ్ వద్ద దారుణ హత్యకు గురైన యువకుడి హత్య కేసును పోలీసులు చేదించారు. భార్య శ్రీలక్ష్మి హత్యకు సూత్రదారైంది. జూన్ 26న పట్టణానికి చెందిన పులిజాల రఘురాములు హత్యకు కారకులైన అయిదుగురు నిందితుల్లో నలుగురి రిమాండ్ , ఒకరు పరారీలో ఉన్నట్లు, వారి నుంచి షిప్ట్ డిజైనర్ కారు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్‌పి నాగేశ్వర్‌రావు తెలిపారు.

శుక్రవారం స్థానిక డిఎస్‌పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. దేవరకొండ పట్టణానికి చెందిన పులిజాల చంద్రమోళి..జయమ్మ దంపతుల ఏకైక కుమారుడు పులిజాల రఘురాములుకు మేనకోడలు శ్రీలక్ష్మితో 13 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి 12 సంత్సరాల కుమార్తె, 10ఏళ్ల కుమారుడు ఉన్నారు. దేవరకొండలో బట్టల షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు.

కాగా రఘురాములు జల్సాలకు అలవాటుపడి రోజు మద్యం సేవించి ఇంటికి వస్త్తుండేవాడని, తన భార్యను పట్టించుకునేవాడు కాడని పేర్కొన్నారు. భర్త ప్రవర్తనతో విసుగుచెందిన భార్య శ్రీలక్ష్మి ఎలాగైనా భర్తను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తన ఇంట్లో పనిచేసే మహిళ భర్త చిలుకరాజు అరుణ్‌తో పరిచయం పెంచుకుంది. ఆర్థ్ధికంగా ఇబ్బందులు ఉండటంతో తన భర్తకు అరుణ్ ద్వారా రూ.లక్ష అప్పుగా ఇప్పించింది. ఇందుకుగాను అధిక వడ్డీకు ఖరారుచేసుకొని వడ్డీ వసూళ్ల క్రమంలో మృతుడి భార్య శ్రీలక్ష్మితో అరుణ్‌కు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఎలాగైనా భర్తను వదిలించుకోచూసిన శ్రీలక్ష్మి భర్తను చంపమని, అందుకు తను రూ.5లక్షలు ఇస్తానని అరుణతో చెప్పిందని, అందులో భాగంగా అప్పటికే రెండుసార్లు రఘురాములును చంపేందుకుగాను ప్రయత్నించి విఫలమైనట్లు తెలిపారు. కాగా తన లక్ష రూపాయలను తిరిగి ఇవ్వాలంటూ అరుణ్, రఘురాములును ఫోన్ ద్వారా ఒత్తిడికి గురిచేస్తున్నాడు.

దీంతో జూన్ 26న రూ.50వేలు ఇస్తానని దేవరకొండకు రమ్మంటూ రఘురాములు అరుణ్‌కు ఫోన్‌చేశాడు. దీంతో అప్పటికి రఘురాములును హత్యచేసేందుకు పథకం రచించడంతో అరుణ్ హైదరాబాద్ నుండి కారులో ముక్కెర భాను, పెనుగొండ్ల రవితేజ, సుచిత్రతో కలిసి జూన్ 26న సాయంత్రం దేవరకొండకు వచ్చి పట్టణ శివారులోని మిషన్ కంపౌండ్ వద్ద ఉన్నాను, డబ్బులు తీసుకొని రావాల్సిందిగా ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. సుమారుగా 8.30 గంటల ప్రాంతంలో రఘురాములు తన భార్యను తను నిర్వహిస్తున్న సెంట్రల్ కిడ్స్ వేర్ నుండి ఇంటి వద్ద దింపి ఇప్పుడే వస్తానని భార్యకు చెప్పి వెళ్లాడు. రఘురాములు అక్కడికి చేరుకోగానే అరుణ్ తమతో తీసుకువచ్చిన సైనెడ్‌ను మృతుడి నోరు, ముక్కలో పోసి భాను, రవితేజల సహాయంతో ఊపిరాడకుండా చేశారు.

రఘురాములు చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత అరుణ్, రఘురాములు భార్య శ్రీలక్ష్మికి ఇన్‌స్ట్రాగ్రామం ద్వారా ఫోన్‌చేసి నీ భర్తను చంపేశామని చెప్పి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. ఈనెల 27న ఉదయం మార్నింగ్ వాకింగ్ వెళ్లిన వారు చూసి సమాచారం అందించడంతో సీఐ పరుశురాం, ఎస్సై సతీష్ సంఘటనాస్థలానికి వివరాలు సేకరించారు. మృతుని తండ్రి పులిజాల చంద్రమోళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహించారు. దర్యాప్తులో భాగంగా మృతుని ఫోన్‌కాల్ డాటా ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్లు తెలిపారు. నిందితులు నేరాన్ని అంగీకరించడంతో వారిని అరెస్టుచేసి డిమాండ్‌చేసినట్లు తెలిపారు. కేసును చేదించిన పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News