Friday, December 20, 2024

ట్విట్టర్‌కు రూ.50లక్షల జరిమానా

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెలువరించిన పలు నిషేధ, ఆంక్షల ఉత్తర్వులను సవాలు చేస్తూ ట్విట్టర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కర్నాటక హైకోర్టు తోసిపుచ్చింది. ట్విట్టర్ కంపెనీ వినతి ప్రాతిపదిక లేకుండా ఉందని జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం తెలిపింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ట్విట్టర్‌పై ఆంక్షలు విధించింది.

అనుచిత వ్యాజ్యం దాఖలు చేసినందుకు ట్విట్టర్‌కు రూ 50 లక్షల జరిమానా విధించింది. దీనిని కర్నాటక రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథార్టీకి 45రోజులలో చెల్లించుకోవల్సి ఉంటుంది. లేకపోతే ప్రతిరోజూ ఐదువేల ఫైన్ పడుతుంది. కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వశాఖకు అనుచితమని భావించిన ట్వీట్ల తొలిగింపు, ఖాతాల నిలిపివేత అధికారం ఉందని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News