సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనున్న గ్రూప్4 పరీక్షకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రూఫ్4 పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా 9.50లక్షలపైగా మంది అభ్యర్థులు రాయనుండగా ఒక హైదరాబాద్ జిల్లాలోనే 59,604 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. వీరి కోసం హైదారాబాద్‌లో మొత్తం 173 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష పూర్తిగా పారదర్శకగా ప్రశాంతంగా జరిగేందుకు జిల్లా యం త్రాగం పటిష్ట ఏర్పాట్లను చేసింది. ఈ పరీక్ష నిర్వహణకుగాను పరీక్షా కేంద్రాల వద్ద వెన్యూ సూపర్‌వైజర్లతోపాటు 173 మంది లోకల్ ఇన్‌స్పెక్షన్ ఆఫీసర్లు ఉంటారని, మరో 48మంది రూట్ ఆఫీసర్లను నియమించారు.
అదేవిధంగా పరీక్ష జరుగుతున్నంత సేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం లే కుండా విద్యుత్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టగా ప్రతి సెంటర్‌లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లతోపాటు ప్ర థమ చిక్సిత బాక్స్‌లతో పాటు ఓ ఆరోగ్య కార్యకర్తను నియమించారు. అదేవిధంగా అభ్యర్థులకు తాగునీరు అందుబాటులో పెట్టడంతో పాటు ఇప్పటికే పరీక్ష హాళ్లను శానిటైజేషన్ చేశారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లతోపాటు ఇతర ఏలాంటి వస్తువులను పరీక్ష కేంద్రాల్లో అనుమతి లేదని అధికారులు వెల్లడించారు. అభ్యర్థులను పూర్తిగా తనిఖీలు చేసేందుకు గేట్ల ఇద్ద ముగ్గురు మగ పోలీసులతో పాటు ఇద్దరు లేడి కానిస్టేబుళ్లను నియమించారు. శనివారం ఉదయం 10 గంటలకు ఈ పరీక్షలు ప్రారంభం కానుండగా ఉదయం 8 .00 నుండి 9 .45 గంటల వరకు మాత్రమే పరీక్ష కేంద్రాల్లో అనుమతించనున్నారు.
పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందే గేట్లను మూసివేయనుండడంతో 9.45 గంటల తర్వాత ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. రెండు విడుతలుగా నిర్వహించనున్న ఈ పరీక్షలు పేపర్ -1 పరీక్షా ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటవరకు, పేపర్ -2 మ ధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటలవరకు కొనసాగనున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పా టు చేశారు. గత పరీక్షల అనుభవాలను దృష్యా భద్రతను పటిష్టం చేశారు. అదేవిధంగా పరీక్షా కేం ద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్, ఇంటర్‌నెట్ షాపుల ను మూసి వేయనున్నారు. అభ్యర్థుల కోసం అన్ని పరీక్షా కేంద్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది.