Friday, December 20, 2024

భారీగా నల్లబెల్లం స్వాధీనం

- Advertisement -
- Advertisement -

అచ్చంపేట ః నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో విశ్వసనీయమైన సమాచారం మేరకు గౌరీ శంకర్ కిరాణ షాపులో శనివారం ఎక్సైజ్ శాఖ అధికారులు ముప్పేట దాడులు నిర్వహించి 450 కేజిల నల్లబెల్లంతో పాటు 40 కేజీల ఆలం స్వాధీనం చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. ఎక్సైజ్ ఎస్సై బాలరాజ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి సమాచారం మేరకు సిబ్బందితో కలిసి పట్టణంలోని గౌరి శంకర్ కిరాణ షాపులో తనిఖీలు నిర్వహించగా కిరాణం షాపులో 450 కేజీల నల్లబెల్లం, 40 కేజీల ఆలం స్వాధీనం చేసుకుని శివ కోటయ్యను అదుపులోకి తీసుకుని అతనిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై బాలరాజు అన్నారు.

శివ కొటయ్య స్వగ్రామం గుంపల్లిలో సారా తయారీకి బెల్లం విక్రయిస్తున్నట్లు తెలపడం జరిగిందన్నారు. కల్వకుర్తి గ్రామానికి చెందిన శంభు సంతోష్, రమేష్ వారి వద్ద నుంచి నల్లబెల్లం విక్రయిస్తున్నట్లు నిందితుడు తెలిపాడని అన్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్సై బాలరాజు మాట్లాడుతూ అచ్చంపేట పట్టణంలోని కిరాణ షాపులలో నిషేధంలో ఉన్న నల్లబెల్లం క్రయవిక్రయాలు జరిపితే ఎలాంటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ముప్పేట దాడుల్లో హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్, తానేష్, టేబుల్ నవీన్ ఉన్నారు.


- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News