- మున్సిపల్ చైర్ పర్సన్ మర్రి దీపికా నర్సింహారెడ్డి
మేడ్చల్: ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరమని మేడ్చల్ మున్సిపల్ చైర్ పర్సన్ మర్రి దీపికా నర్సింహారెడ్డి అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ 13 వ వార్డు కౌన్సిలర్ మర్రి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి 13వ వార్డుకు చెందిన వజ్రబాయికి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వార మంజూరైన రూ.25 వేల చెక్కును శనివారం అందజేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మర్రి దీపిక నరసింహారెడ్డి మాట్లాడుతూ ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా అందించే ఈ ఆర్థిక సహాయం నిరుపేదలకు ఎంతగానో సహాయపడుతుందని, గతంలో పేద ప్రజలు వైద్య ఖర్చుల కోసం అధిక వడ్డీకి అప్పులు తెచ్చి, అప్పుల ఊబిలో కూరుకు పోయేవారని, ప్రస్తుత ప్రభుత్వం ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా అందించే ఈ ఆర్థిక సహాయం నిరుపేదలను ఆ ప్రమాదం నుంచి కాపాడుతుందని కొనియాడారు. కెసిఆర్ పాలనలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు పరుస్తుందని పేర్కొన్నారు.
13వ వార్డు కౌన్సిలర్ మర్రి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ పట్టణంలోని పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించడానికి మంత్రి మల్లారెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని, ఎల్లపుడూ ప్రజల సంక్షేమం గురించే ఆలోచించే గొప్ప మనసున్న మహారాజు మంత్రి మల్లారెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ ఉప సర్పంచ్ మర్రి నర్సింహా రెడ్డి, మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.