Friday, November 22, 2024

నేటి నుండి 134 రకాల వైద్య పరీక్షలు అందుబాటులోకి : మంత్రి హరీష్‌రావు

- Advertisement -
- Advertisement -

కొండాపూర్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడం జరుగుతుందని రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పుస్కరించుకొని కొండాపూర్‌లోని జిల్లా ఆసుపత్రిలో టీ డయాగ్నస్టిక్స్‌లో ప్రస్తుతం ఉచితంగా అందిస్తున్న 57 రకాల టెస్టుల సంఖ్యను 134కు పెంచిన పరీక్షలను కొండాపూర్ జిల్లా ఆసుపత్రి హాజరై ఎమ్మెల్సీ బాను ప్రసాద్, ఎమ్మెల్సీ బండ ప్రకాష్, తెలంగాణ రాష్ట్ర మెడికవల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, తెలంగాణ టూరిజం మాజీ చైర్మన్ ఉప్పాల శ్రీనివాస్‌గుప్తా, జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్, హెల్త్ కమిషనర్ శేత్వా మెహతి, డిఎంహెచ్‌ఒ వెంకటేశ్వరరావు, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ సృజనలతో కలిసి వర్చువల్‌గా మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులో కార్పొరేటర్ స్థాయి వైద్యం అందించడం జరుగుతుందన్నారు.

టీ డయాగ్నస్టిక్స్‌లో ఇప్పటి వరకు 57 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా అందిస్తున్న సంఖ్యను ఇప్పుడు 134కు పెంచడం జరిగిందన్నారు. వైద్య పరీక్షలను సంబంధించిన రిపోర్టులను రోగి మొబైల్‌కు పంపిస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో టిఫా స్కాన్, 2డి ఎకో రేడియాలజీ ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చాం అన్నారు. మహిళలకు కెసిఆర్ కిట్ గర్భిణులకు పౌష్టికాహార కిట్ అందిస్తోందన్నారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం ప్రసవాలు జరిగితే, ఇప్పుడు 70 శాతం అవుతున్నాయన్నారు. పేద ప్రజలకు నిమ్స్‌లో అత్యాదునిక వైద్యం అందిస్తున్నామన్నారు. హైదరాబాద్ చుట్టు పక్కల నాలుగు మల్టీ స్పెషాలిటీ హస్పిటల్స్ త్వరలోనే అందుబాటులోకి రానున్నాయన్నారు. ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ వైద్యం కోసం ఏ దవాఖానాకు వెళ్లిన వైద్యులు రక్త పరీక్షలు చేయాలని అంటారని అందుకోసమే తెలంగాణ డయాగ్నోస్టిక్ సేవలు ప్రారంభించడం జరిగిందన్నారు. ఇక్కడ పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్‌ను, నవజాత శిశువు సంరక్షణ కేంద్రాన్ని ఈ రోజు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కొండాపూర్ జిల్లా ఆసుపత్రిని అన్ని హంగులతో సకల సౌకర్యాలతో తీర్చిదిద్దటం జరిగిందన్నారు.

కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ఈ అవకాశంను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్బంగా వైద్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్, దొడ్ల వెంకటేష్‌గౌడ్, నార్నెశ్రీనివాస్‌రావు, ఉప్పలపాటి శ్రీకాంత్, కొండాపూర్ హస్పిటల్ సూపరిండెంట్ వరదచారీ, కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్, సంజీవరెడ్డి, రఘునాథ్‌రెడ్డి, సమ్మారెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, గౌతమ్‌గౌడ్, హరీష్‌రావు, ఊట్ల కృష్ణ, రమేష్, బలరాం యాదవ్, షేక్ చాంద్‌పాషా, రవీందర్‌రెడ్డి, ప్రసాద్, గౌరీ, నిర్మల, నరసింహసాగర్, రాజు యాదవ్, శ్రీనివాస్‌చౌదరి, గువ్వల రమేష్, మల్లెల శ్రవణ్ యాదవ్, తిరుపతిరెడ్డి, బసవరాజు, తిరుపతి, రజనీకాంత్, తిరుపతియాదవ్, సాయి శామ్యూల్‌కుమార్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News