సుజాతనగర్ : మండల కేంద్రంలో బిఆర్‌ఎస్ పార్టీ మండల కమిటీ సమావేశం శనివారం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిధిగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్టీ నూతన మండల అధ్యక్షుడిగా శ్రీరెడ్డెం తులసి రెడ్డిని, సుమారు 90 శాతం ప్రజా ప్రతినిధులు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా సుజాతనగర్ మండల రైతు సమన్వయ కమిటీ కన్వీనర్‌గా పెద్దమల్ల నరేంద్ర ప్రసాద్, సుజాతనగర్ గ్రామ కమిటీ అధ్యక్షుడుగా వేముల సత్యనారాణలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ బిఆర్‌ఎస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికే పదవులు దక్కుతాయని, రాష్ట్రంలో మూడోసారి ముఖ్యమంత్రిగా కేసిఆర్ ఎన్నిక కావడం ఖాయమని అన్నారు. ఈ సమావేశంలో వనమా రాఘవేందర్, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, ఎంపీపీలు భూక్యా సోనా, బాదావత్ శాంతి, మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, శివాలయం గుడి కమిటీ చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, ఎంపిటీసిలు బత్తుల మానస, పెద్దమల్ల శోభారాణి, మూడు గణేష్, కో ఆప్షన్ సభ్యులు , సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.