Monday, December 23, 2024

పేద ప్రజల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ

- Advertisement -
- Advertisement -

మెదక్ : పేద ప్రజల ఆరోగ్యం పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని నిరుపేద ప్రజలకు జిల్లా ఆసుపత్రిలో ఉచిత రక్త పరీక్షల కోసం తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ ను అందుబాటులోకి తీసు కువచ్చిందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి స్పష్టం చేశారు.శనివారం మెదక్ జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రిలో తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్ లో 57 పరీక్షల నుండి 134 రకాల వైద్య పరీక్షల వరకు స్థాయిని, పరీక్షల ఆధునిక యంత్రాలను ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి,ఆదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జడ్పి వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి, డిసిహెచ్ డా. చంద్ర శేఖర్, డిఎంహెచ్‌ఓ డా. చందు నాయాక్ లతో కలిసి ప్రారంభించారు.అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ లో ప్రారంబించి వెబ్ ద్వారా మాట్లాడుతూ పలు సూచనలు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న వైద్య సేవల గురించి వివరించారు. సేవలు అందేలా వైద్యులు, ప్రజాప్రతినిధులు పర్యవేక్షించాలని సూచించారు. వైద్య సౌకర్యాల గురించి ప్రజలకు విరివిగా తెలిసేలా చూడాలన్నారు. ఓపి, సీజనల్ వ్యాదులపై దృష్టి సారించాలని వైద్యులను కోరారు. ఇన్ని రకాల వైద్య సేవలు అందిస్తుంది కేవలం తెలంగాణలోనే అన్నారు. అది ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుచూపుకు నిదర్శనమన్నారు. ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళా పర్యవేక్షణ చేయాలని ఎమ్మెల్యేకు, అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ కు సూచిం చారు.నర్సంపేటతో పాటు మెదక్ లో కూడా మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని మంత్రి హరీశ్ రావు మరోసారి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ టిడయాగ్నొస్టిక్ సెంటర్ లో 57 పరీక్షల నుండి 134 రకాల వైద్య పరీక్షల వరకు స్థాయిని పెంచడం పేద ప్రజలకు చాలా ఉపయోగకరమైనవన్నారు.

పేద ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లే అవసరం లేదని క్యాన్సర్ వంటి అన్ని రకాల రక్త పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రి చేసుకోవచ్చన్నారు. నిరుపేదలపై కేసీఆర్ కి ఎంతో చిత్తశుద్ధి ఉందని అందుకు నిదర్శనమే ఈ గొప్ప ఆలోచన అన్నారు. జిల్లా ప్రజలందరూ జిల్లా ఆస్పత్రిలో ఉచిత పరీక్షలు చేయించుకుని ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ కెసిఆర్ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో కంటి వైద్యులు డా. చంద్రశేఖర్, డా. కిరణ్ రెడ్డి, కౌన్సిలర్లు రాగి వనజ అశోక్, శ్రీనివాస్, రాజు, ఆత్మ చైర్మన్ అంజగౌడ్, పాక్స్ చైర్మన్ హన్మంత్ రెడ్డి, గంగాధర్, గూడూరి అరవింద్ గౌడ్, బాని తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News