Saturday, December 21, 2024

మోడీ పాలనలో దేశం అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట : మోడీ పాలనలో దేశాభివృద్ధ్ది జరుగుతుందని బిజెపి జాతీయ నాయకులు మధ్యప్రదేశ్ ఇంచార్జి పోల్సాని మురళిదర్‌రావు అన్నారు. మోడి తొమ్మిది సంవత్సరాల పాలన పూర్తయిన సందర్భంగా పార్టీ పిలుపు మేరకు మహాజన్ సంపర్క్ అభిమాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం సిద్దిపేట వెంకటేశ్వర ఆలయం వద్ద జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోడి సారద్యంలో ఏర్పడిన బిజెపి ప్రభుత్వ పాలనలో దేశం అన్ని రంగాల్లో రాణిస్తుందన్నారు.

ప్రపంచ దేశాల్లో భారతదేశం కీర్తి, ప్రతిష్టలు మారు మోగడానికి మోడీ చేసిన కృషి మరువలేనిదన్నారు. మూడవ సారి కూడా మళ్లి మోడీ ప్రదాని కావాలని దేశ ప్రజలు కోరుతున్నారని ఆశా భావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల కుప్పగా మర్చారని ఆరోపించారు. తెలంగాణ రాష్టం మరింత అభివృద్ధ్ది పథంలో నడవాలంటే తెలంగాణలో కూడా బిజెపి ప్రభుత్వం రావాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పత్రి శ్రీనివాస్ యాదవ్, జిల్లా ఇంచార్జి అంజన్‌కుమార్, సిరిసిల్ల జిల్లా ఇంచార్జి మోహన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విద్యాసాగర్, అంబటి బాలేష్ గౌడ్, రాంచంద్రారెడ్డి, రాంచందర్‌రావు, ఉపేందర్‌రావు, నరేశ్, మల్లేశం, శ్రీనివాస్‌రెడ్డి, నరసింహారెడ్డి, పరుశరాములు, గోనె మార్కండేయులు, వెంకటేశం, శ్రీనివాస్, శంకర్, శివకుమార్, నాగరాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News