Saturday, November 23, 2024

న్యాయవాదులపై దాడులను అరికట్టాలి: ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ప్రభుత్వాన్ని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. శనివారం నగరంలో న్యాయవాదుల రక్షణ చట్టంపై జరిగిన అవగాహన సదస్సుకు ముఖ్యఅతిగా హాజరై ప్రసంగిస్తూ మంథనిలో న్యాయవాదులైన వామన్ రావు దంపతులను పట్టపగలేకొందరు దుండగులు మరణాయుధాలతో నడిరోడ్డుపై హత్య చేసినా హంతకులను శిక్షించక పోవడం దారుణమన్నారు. తుంగతుర్తిఎమ్మెల్యే అవినీతి, అక్రమాలను బయటపెడుతున్నాడనే కక్షతో న్యాయవాది యుగేందర్ పై దాడి జరిగిందని అన్నారు. న్యాయవాదులు హత్య గావించబడిన,భౌతిక దాడులకు గురైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే డాక్టర్లకు రక్షణ చట్టం ఉన్నట్లే,న్యాయవాదులకు కూడా ప్రత్యేక రక్షణ చట్టాన్ని తెస్తామని హామీ ఇచ్చారు. 41(ఏ) సిఆర్పీసి చట్టాన్ని పోలీసులు నిర్వీర్యం చేస్తున్నారన్న దానిని రద్దు చేసి, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకరావాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయవాదులపై రాజకీయ నాయకుల ఒత్తిడి లేకుండా ఉండే చట్టాలను తీసుకువస్తామని హామీ ఇచ్చారు. బహుజన రాజ్యంలో యువ న్యాయవాదులకు రూ.5 లక్షల నుంచి 10 లక్షల వరకూ ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. ఆధిపత్య పాలకులు రాజ్యాంగం,చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడం లేదన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News