Saturday, November 23, 2024

2023 సేవాభారత్ అవార్డులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: సమాజంలో సామాజిక రగ్మతలను రూపుమాపి మెరుగైన సమాజం కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు హెవెన్ హోమ్స్ సొసైటి అధక్షులు జి.వరలక్ష్మి వెల్లడించారు.హెవెన్ హోమ్స్ సొసైటీ 11 వ ”వార్షిక వేడుకలను ఆగస్టు16న నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సందర్బాన్ని పురస్కరించుకొని సేవాభారత్ అవార్దులు వివిధ వృత్తులకు , సమాజ అభివృద్ధికి దోహదపడే వివిధ వ్యక్తులకు ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం కోసం ఉచిత నామినేషన్లు ఈనెల 10 లోపు పంపాలన్నారు .ఈ అవార్డు ఎంపిక ప్రక్రియ ప్రకారం, నామినీలు దిగువ పేర్కొన్న మెయిల్ ఐడి కి తమ ప్రొఫైల్స్ ని పంపాల్సి ఉంటుందని, జ్యూరీ సభ్యుల ద్వారా వారు ఎంపిక చేయబడతారని తెలిపారు.

ఎంపిక చేయబడ్డ నామినీలు కింద పేర్కొన్న 8 అంశాల్లో ఏదైనా ఒకటి నుంచి 2 నిమిషాల నిడివి కల సెల్ఫ్ వీడియోని మాత్రమే సిద్ధం చేయాల్సి ఉంటుందన్నారు.వీటిలో ప్రస్తుత రాజకీయ రంగాల్లో మాట్లాడే భాష ఆమోదకరంగా ఉందా? వాళ్లు కార్నర్ చేసే విధానము కరెక్ట్ గా ఉందా లేదా?, సేంద్రియ ఆహారం తీసుకోవడం మరియు సేంద్రియ వ్యవసాయానికి మద్దతు అందించడం అనేది ఇప్పుడు ప్రధానంగా ఉందా ? ఇప్పుడున్న ప్రస్తుత వైద్య విధానంలో తీరుతెనులు, డేటింగ్ యాప్స్ అనేవి ఈరోజు జనాలకి దగ్గరికి తీసుకొస్తున్నాయా? మన కుటుంబ వ్యవస్థని కుదేలు చేస్తున్నాయా, విడాకుల రేటింగ్లో ముఖ్య కారణాలు? మరియు తల్లిదండ్రుల జోక్యం ఆమోదకర మేన? దానివల్ల కలిగే పరిణామాలు బహిరంగ ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు మరియు పిల్లలు వేధింపులపై సమీక్ష,మహిళలపై స్పై కెమెరాల ప్రతికూల వాడకం
సామాజిక మాధ్యమాలలో మహిళలపై అసభ్య చిత్రాలు, 35 సంవత్సరాలు నిండిన మహిళలు భర్తను కోల్పోయిన వాళ్లు ఎక్కువమంది ఉన్నారు. దీనికి గల కారణాలు, లేటెస్ట్ టెక్నాలజీతో మరియు అడ్వానస్డ్ టెక్నాలజీ తోటి మన కొత్త పరిచయాలు ఆన్లైన్లోనే పరిచయాలు మనల్ని నిజం గానే అడ్వానస్డ్ చేస్తున్నాయా? దాంట్లో మనమేమైనా చిక్కుకుపోతున్నామా అన్నవి ప్రధాన అంశాలుగా ఉంటాయని తెలిపారు. వీడియోస్ కి పబ్లిక్ రెస్పాన్స్ ఎవరికి ఎక్కువ వస్తే వారికి సేవా భారతి అవార్దుల తోపాటు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుందన్నారు.పబ్లిక్ రెస్పాండ్ కౌంటింగ్ లాస్ట్ డేట్ జూలై 31గా నిర్ణయించినట్టు వరలక్ష్మి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News