Monday, January 20, 2025

చొరబడి కొడుతాం..ఏరేస్తాం: పాకిస్థాన్‌కు రక్షణ మంత్రి హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

చొరబడి కొడుతాం..ఏరేస్తాం
పాకిస్థాన్‌కు రక్షణ మంత్రి హెచ్చరిక
కంకెర్ (చత్తీస్‌గఢ్): భారతదేశం ఇప్పుడు మునుపటిలా లేదు. మారింది. దెబ్బకు దెబ్బతీస్తుందని, ఇప్పుడు లోపలికి చొరబడి చంపేస్తుందని పాకిస్థాన్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. శాంతంగానే ఉంటామని, అయితే పొరుగు వారు ఎవరైనా భారతదేశానికి హాని తలపెడితే తగు విధంగా జవాబు ఇవ్వడం జరుగుతుందని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. చత్తీస్‌గఢ్‌లోని మావో ప్రాబల్యపు కంకెర్ జిల్లాలో రక్షణ మంత్రి గురువారం ఓ సభలో మాట్లాడారు.

చత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తే అంతర్గతంగా ఉన్న వామపక్ష తీవ్రవాదం (ఎల్‌డబ్లుఇ)ని కూడా తుదముట్టిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పుడు మతమార్పిడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన తొమ్మిదేళ్లలో మోడీ ప్రభుత్వం హయాంలో సాధించిన ప్రగతిని వివరించేందుకు బిజెపి సారధ్యంలో స్థానిక నరహర్దేవ్ హైస్కూల్ గ్రౌండ్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇందులో ప్రసంగించిన రక్షణ మంత్రి పాకిస్థాన్‌పై ఘాటు హెచ్చరికలకు దిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News