Monday, December 23, 2024

ప్రజ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలి

- Advertisement -
- Advertisement -

మియాపూర్: ప్రజ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అన్ని శాఖల అధికారులు స మన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ అన్నారు. వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకొని డ్రైనేజీ పైప్‌లైన్ నిర్మాణం పనులు వేగవంతం చేయాలని అదేవిధంగా మంచినీరు కలుషితం కాకుండా స్వచ్ఛమైన తాగునీరు ప్రజలకు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నా రు. మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీవరేజ్ వ్యవస్థ, మంచినీటి సరఫరా నిర్వహణ పనితీరుపై, విధి విధానాలపై జోనల్ కమిషనర్ శంకరయ్య, కార్పొరేటర్లు హమీద్‌పటేల్, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్‌గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, జలమండ లి అధికారులతో కలిసి ఆయన శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ వర్షాకాలన్నీ దృష్టిలో పెట్టుకొని కాలనీలలో ప్రజలకు ఎటువం టి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని, డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సరఫరాపై దృష్టి సారించాలని అన్నారు. అదేవిధంగా డ్రైనేజీ కొత్త పనుల ప్రతిపాదనలు తీసుకురావాలని, ప్ర స్తుతం చేపడుతున్న పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రతి కాలనీలో మంచినీరు సరఫరాకు ఎటువంటి అంతరాయం కలుగకుండా జాగ్రత్తలు వహించాలని ప్రజల నుంచి వినతులు సత్వరమే పరిష్కరించేలా అధికారులు బాధ్యత వహించాలని ఆయన పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలు పరిష్కరించాలని, అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని ఆ యన సూచించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బిఆర్‌ఎస్ అధ్యక్షులు రఘునాథ్ యా దవ్, జలమండలి అధికారులు జీఎం రాజశేఖర్, డీజీఎం శరత్ రెడ్డి, మేనేజర్లు యాదయ్య, సందీప్ కుమార్, నరేందర్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, పూర్ణేశ్వరి, సాయి చరిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News