Thursday, January 2, 2025

మంత్రి సబితాఇంద్రారెడ్డిపై కొత్త మనోహర్‌రెడ్డి ఆరోపణలు దురదృష్టకరం

- Advertisement -
- Advertisement -

బాలాపూర్: మహేశ్వరం నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధితో పాటు ఇక్కడి ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తూ అనునిత్యం ప్ర జలతో మేమేకమై,వారి కష్ట,సుఖాల్లో పాలుపంచుకునే రాష్ట్ర విద్యాశాఖ మం త్రి, స్ధానిక ఎమ్మెల్యే పట్లోళ్ల సబితఇంద్రారెడ్డిపై నియోజకవర్గం బిఆర్‌ఎస్‌పార్టీ మాజీ ఇన్‌ఛార్జ్ కొత్త మనోహర్‌రెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేయడం దృరదృష్టకరమని మీర్‌పేట్ కార్పొరేషన్ బిఆర్‌ఎస్‌పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేష్‌గౌడ్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఒక మహిళ అయ్యిఉండి రోజులో సుమారు 16 గంటలపాటు ప్రజాసమస్యల పరిష్కారం కోసం పరితపిస్తూ పనిచేసే సబితపై ఆరోపణలకు పాల్పడుతున్న మ నోహర్‌రెడ్డి వ్యవహారశైలి చూస్తుంటే తల్లి పాలు తాగి రొమ్ము కోసినట్లుగా ఉంద ని మండిపడ్డారు.

2014 ఎన్నికలకు 10 రోజుల ముందు అప్పటి టిఆర్‌ఎస్‌పార్టీలో చేరి ఎమ్మెల్యే టిక్కెట్ తెచ్చుకున్న మనోహర్‌రెడ్డి ఏ విధంగా ఉద్యమకారు డు అవుతాడో అర్ధం కావడం లేదని,అసలు మంత్రి సబిత ఆయనకు చేసిన అ న్యాయం ఏంటో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.మనోహర్‌రెడ్డి ఆరోపణలు చేస్తున్న విధంగా మంత్రి సబితది కక్షసాధింపు చర్యలకు పా ల్పడే కుంచితమైన మనస్ధత్వం కాదని,ఒకవేళ నిజంగా మనోహర్‌రెడ్డిపై మంత్రి కక్షసాధించాలి అని అనుకుంటే వీధివ్యాపారుల సముదాయం నిర్మాణ సమయంలోనేఆయనపై చర్యలు ఉండేవని అన్నారు. తనపై ఆరోపణలు, విమర్శలు చేసే ప్రతిపక్ష నాయకులతో పాటు స్వపక్షంలోని కొంతమంది మనోహర్‌రెడ్డి లాంటి నాయకులకు పనితీరుతోనే సామాధానం చెప్పే మనస్ధత్వం సబితది అని అన్నారు. పచ్చకామెర్ల కళ్లతో ప్రతివిషయంలో తప్పులు వెతికే మనోహర్‌రెడ్డి లాంటి మరుగుజ్జులకు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కనిపించదని,కంటివెలుగు కార్యక్రమంలో ఆయనకు పరీక్షలు అవసరం అయితే ఆయనకు కంటిఅద్దాలను అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. అదేవిధంగా ని యోజకవర్గం అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని,మనోహర్‌రెడ్డి సిద్ధమేనా అని ప్రశ్నించారు.ఇప్పటికైనా నోరుఅదుపులో పెట్టుకొని మనోహర్‌రెడ్డి మాట్లాడితే ఆయనకే మంచిదని, లేనిపక్షంలో సబితమ్మ సైనికుల ఆగ్రహ, ఆవేశాలకు ఆయన గురికాక తప్పదని ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో భూపేష్‌గౌడ్ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News