Monday, December 23, 2024

కష్టాల్లో ఇంగ్లండ్

- Advertisement -
- Advertisement -

లండన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ రెండో టెస్టులో కూడా ఇంగ్లండ్‌కు ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. 371 పరుగుల క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ శనివారం నాలుగో రోజు తాజా సమాచారం లభించే సమయానికి 69 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఈ మ్యాచ్‌లో ఓటమి తప్పించుకోవాలంటే ఇంగ్లండ్ మరో 302 పరుగులు చేయాలి. ఇప్పటికే కీలక వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో గట్టెక్కడం కష్టంగా కనిపిస్తోంది.

ఓపెనర్ జాక్ క్రాలి (3), ఓలి పోప్ (3), జో రూట్ (18), హ్యారి బ్రూక్ (4) పెవిలియన్ చేరారు. కమిన్స్, స్టార్క్ రెండేసి వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను కష్టాల్లోకి నెట్టారు. అంతకుముందు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 279 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఖ్వాజా 77 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా వారు ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్ నాలుగు, టంగ్, రాబిన్సన్ రెండేసి వికెట్లు తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News