Friday, December 20, 2024

కంప్రెషర్ బండిలో బాంబులు పేలి: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

నల్లమల: నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అడవిలో ఆదివారం ఉదయం  బాంబు పేలుడు సంభవించింది. పదర మండలం రాయగండి తాండ సమీపంలో కంప్రెషర్ ట్రాక్టర్ లో బాంబులు పేలి ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. బావులు తీయడానికి కంప్రెషర్ ట్రాక్టర్ ఉపయోగిస్తున్నారు. బావులు తవ్వేటప్పుడు రంధ్రాలు చేసి బాంబులు అమర్చుతారు. కంప్రెషర్ ట్రాకర్ బ్రేక్ కు ముందు భాగం డబ్బాలో బాంబులను తీసుకెళ్తారు.

Also Read: అమెరికాలో మరో వెనుకడుగు!

బాంబులను తీసుకెళ్లేటప్పుడు బాంబులపై వేడి వస్తువు తగలడంతో పేలిపోయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బావిలో కూడా కొన్ని బాంబులు పేలిపోకుండా ఉండి రెండో సారి బాంబులు అమర్చినప్పుడు పేలి డ్రైవర్లు గాయపడిన ఘటనలు చాలా ఉన్నాయని కంప్రెషర్ డ్రైవర్లు, సిబ్బంది చెబుతున్నారు. కంప్రెషర్ బండితో చాలా జాగ్రత్తగా ఉండాలని లేకపోతే ప్రాణాలు గాల్లో కలుస్తాయని డ్రైవర్లు హెచ్చరిస్తున్నారు. కంప్రెషర్ బండి నడిపడం అంటే ప్రాణాలతోచెలగాటం ఆడినట్టుగా ఉంటుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News