Monday, December 23, 2024

సంగారెడ్డి హస్తబలిలో ఎల్లమ్మ బోనాలు

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: సంగారెడ్డిలోని ఎఫ్‌ఆర్‌ఎస్‌లోని ఎల్లమ్మ దేవాలయంలో ఆషాఢ బోనాల ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మబైలెల్లీనాదో తల్లి బైలెల్లీనాదో అంటూ బోనాలు సమర్పించేందుకు సంగారెడ్డి పట్టణ వాసులతో పాటు మండలంలోని గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు తరలివచ్చారు. రెండో ఆదివారం బోనాలు సమర్పించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అదే విధంగా కోళ్లు, మేకలను బలిచ్చి తమ మొక్కులను చెల్లించుకున్నారు. మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి సహంపక్తి భోజనాలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News