Monday, December 23, 2024

ఉన్నత విద్య ఉపాధి కేంద్రంగా సిద్దిపేట

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: మంత్రి హరీశ్‌రావు కృషి ఫలితంగా ఉన్నత విద్య ఉపాధి కేంద్రంగా సిద్దిపేట మారిందని బిఆర్‌ఎస్‌వి పట్టణ అధ్యక్షుడు గరిపల్లి మహిపాల్ గౌడ్, పట్టణ కౌన్సిలర్ భూంపల్లి శ్రీలత శ్రీహరి అన్నారు. ఆదివారం పట్టణంలోని 35వ వార్డులో బిఆర్‌ఎస్‌వి విద్యార్థి ఆత్మీయ సమావేశంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటను పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య అయిన ఇంజనీర్, మెడిసిన్, ఆగ్రికల్చర్, ఫార్మసి, పాలిటెక్నిక్ వంటి విద్యాసంస్థలను నెలకొల్పి దానితో పాటు ఉపాధి అవకాశాలు మెరుగు పరిచే దిశగా డిఎక్స్ ఎన్, ఐటి హబ్, ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరి పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల అనేక కంపెనీలను తీసుకువస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం సిఎం కెసిఆర్ నేతృత్వంలో ఇప్పటికే లక్ష ఉద్యోగాలు భర్తి చేసిందన్నారు. మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో అనేక కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి సర్కార్ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ప్రభుత్వ అనుబంధ సంస్థలు ఎత్తివేసిఉన్న ఉద్యోగాలను ఊడగొట్టిందన్నారు. అనంతరం నూతన కమిటీ 35వ వార్డు అధ్యక్షుడుగా శ్రీకాంత్‌ను నియమించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్‌వి నియోజక వర్గ ఉపాధ్యక్షుడు పెర్క మధు, పట్టణ ఉపాధ్యక్షుడు రాగారం రాములు, కరోళ్ల సతీష్, మెరుగు మాదవ్, పోతుల నరేశ్, బసంపల్లి నాగరాజు, శ్రీను , రమేశ్ , తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News