Sunday, January 19, 2025

కెసిఆర్ మాటలు కోటలు దాటాయి.. ప్రగతి భవన్ గడప దాటలేదు: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రైతులకు ఉచిత ఎరువులు ఇస్తామని సిఎం కెసిఆర్ హామీ ఏమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామన్నారని అది ఏమైందని అడిగారు. ఈ నెల 8న వరంగల్ ప్రధాని నరేంద్ర మోడీ వస్తారని చెప్పారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ మాటలు కోటలు దాటాయి తప్పా ప్రగతి భవన్ గడప దాటలేదని విమర్శించారు. కెసిఆర్ అవినీతి డబ్బులు ఎన్ని కోట్లు ఖర్చు చేసినా గద్దె దిగక తప్పదని చురకలంటించారు. అవినీతి, అక్రమ దందాలు, కుటుంబ పాలన పోవాలని ధ్వజమెత్తారు. తెలంగాణలో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం పెద్ద పీట వేస్తోందని, తెలంగాణ అభివృద్ధిలో రీజినల్ రింగ్ రోడ్డు కీలక పాత్ర వహిస్తుందని ప్రశంసించారు.

Also Read: మంత్రులు కావాలనే నిర్ణయం వ్యక్తిగతం, పార్టీ మద్దతు లేదు: ఎన్సీపీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News