Sunday, January 19, 2025

ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ: ఇద్దరు యువకులు మృతి

- Advertisement -
- Advertisement -

ఫరూఖ్‌నగర్: ద్విచక్ర వాహనాన్ని ఓ లారీ ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందగా మరో యువకుడు తీవ్ర గాయాలపాలైన సంఘటన ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని ఎలికట్ట గ్రామ పంచాయతీ శివారులో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాల్ ఎలికట్ట గ్రామానికి చెందిన రాజు, మధు, పురుషోత్తంలు ఆదివారం షాద్‌నగర్ పట్టణానికి వెళ్లేందుకు నిర్ణయించుకొని ద్విచక్ర వాహనంపై ఉదయం గ్రామం నుండి బయలు దేరారు.

ఈ నేపథ్యంలో గ్రామ శివారు ప్రాంతం ఎస్‌ఆర్ పెట్రోల్ బంకు సమీపంలో ద్విచక్ర వాహనంలో పెట్రోల్ పోయించుకునేందుకు యూ టర్న్ తీసుకుంటుండగా షాద్‌నగర్ నుండి ఎలికట్ట వైపు వస్తున్న లారీ వేగంగా యూటర్న్ తీసుకుంటున్న బైక్‌ని ఢీ కొట్టడంతో బైక్‌పై ఉన్న రాజు (17) అక్కడికక్కడే మృతి చెందగా మధు (19) మార్గమధ్యలో మృతి చెందాడు, మరో యువకుడు పురుషోత్తం తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ సీఐ ప్రతాపలింగం ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.

లారీ డ్రైవర్ అజాగ్రత్తగా లారీని డ్రైవ్ చేయడంతోనే ప్రమాదం జరిగిందని ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. లారీ డ్రైవర్ అజాగ్రత్తకు ఇద్దరు యువకులు బలైన ఘటనతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. కొద్ది నిమిషాల క్రితం కండ్ల ముందు కదలాడిని పిల్లలు ఇక లేరనే చేదు నిజాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోకపోతుతన్నారు. కన్న వారి రోదనతో స్థానికులు సైతం కన్నీటిపర్యంతమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News