Tuesday, April 8, 2025

ఘనంగా శ్రీసాయిసత్య వ్రతాలు

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : ఖమ్మం నగరంలోని గాంధీచౌక్ శ్రీవరప్రదాత షిర్డిసాయి మందిరంలో నిర్వహిస్తున్న 13వ వార్షికోత్సవ గురుపౌర్ణమి వేడుకల్లో భాగంగా ఆదివారం శ్రీసాయిసత్య వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 150 మంది దంపతులు పాల్గొన్నారు. అంతకుముందు గణపతిపూజ, మండప ఆరాధన, సాయినాదునికి గోదుమలతో అభిషేకం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇదిలా ఉండగా సోమవారం ఇక్కడ గురుపౌర్ణమి వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు మందిర కమిటి అద్యక్షులు డాక్టర్ వేములపల్లి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి అర్వపల్లి నిరంజన్, కోశాధికారి కురువెళ్ల వెంకట జగన్మోహనరావులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News